యాప్నగరం

బాలకృష్ణ 102వ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్!

బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలని భావిస్తోన్న మేకర్స్.. టైటిల్ విషయంలో...

TNN 9 Oct 2017, 7:02 pm
బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలని భావిస్తోన్న మేకర్స్.. టైటిల్ విషయంలో ఓ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం బాలయ్య కెరీర్‌లో 102వ చిత్రమైన ఈ సినిమాకు కర్ణ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే కుంభకోణంలో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
Samayam Telugu balakrishnas nbk102 gets an interesting title
బాలకృష్ణ 102వ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్!


బాలకృష్ణ సరసన నయనతార, మళయాళం ముద్దుగుమ్మ నతాషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంకా 50 శాతం షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమాకు అప్పుడే శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.