యాప్నగరం

మోక్షజ్ఞతో ‘శ్రావణి’ ప్రేమకథ?

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఏ సినిమాతో తెరంగేట్రం చేస్తాడా అని నందమూరి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది.

TNN 27 Jan 2017, 5:10 pm
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఏ సినిమాతో తెరంగేట్రం చేస్తాడా అని నందమూరి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ప్రేమకథ, యాక్షనా, చారిత్రకమా, కామెడీనా, థ్రిల్లర్... ఇలా ఎలాంటి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతాడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తన కెరీర్‌కు గౌతమీ పుత్ర శాతకర్ణిలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన క్రిష్ పై బాలయ్యకు నమ్మకం బాగా పెరిగినట్టు తెలుస్తోంది. అందుకే తన కొడుకును హీరోగా పరిచయం చేసే అవకాశాన్ని క్రిష్ కే ఇవ్వనున్నట్టు సమాచారం.
Samayam Telugu balakrishnas son mokshagna debut movie titled as sravani
మోక్షజ్ఞతో ‘శ్రావణి’ ప్రేమకథ?


చారిత్రక సినిమా ద్వారానే మోక్షజ్ఞ కూడా తెలుగుతెరకు పరిచయం అవ్వాలని బాలయ్య కోరిక. అందుకే గౌతమీ పుత్ర శాతకర్ణి కొడుకు వాశిష్టి పుత్ర పులోమావి కథనే సినిమాగా తీయాలనుకుంటున్నారని టాక్. అయితే పులోమావి ప్రేమకథను తెరకెక్కిస్తే బాగుంటుందని క్రిష్ భావిస్తున్నాడట. అందుకే పులోమావి ప్రేయసి పేరు శ్రావణి. పులోమావి-శ్రావణి ప్రణయ గాథనే మోక్షజ్ఞ హీరోగా క్రిష్ తెరకెక్కించబోతున్న సినిమాగా ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ గతంలోనే వీరి ప్రేమకథకు నవలారూపాన్ని ఇచ్చారు. ఆ నవలకు ‘శ్రావణి’ అనే పేరు పెట్టారు. కనుక సినిమాకు కూడా ఆ పేరే పెట్టే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.