యాప్నగరం

బాలయ్య 101వ సినిమా ఓకే.. తమన్నాకి ఛాన్స్ ?

రాయలసీమ ఫ్యాక్షన్ కథని ఓకే చేసిన బాలయ్య.. మరోసారి మీసం తిప్పి తొడగొట్టనున్నాడు

TNN 22 Feb 2017, 3:43 pm
చారిత్రక కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో తన వందో చిత్రాన్ని మధురానుభూతిగా మిగిల్చుకున్న నందమూరి బాల‌కృష్ణ‌.. తర్వాత సినిమా ఎంపికపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినా బాల‌కృష్ణ‌ మాత్రం తనకు బాగా కలిసొచ్చిన ఫాక్షన్ కథవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ​ కె.ఎస్. రవికుమార్ సరిగ్గా ఇలాంటి కథతోనే బాల‌కృష్ణ‌‌ను సంప్రదించి సినిమాని ఓకే చేసినట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.
Samayam Telugu balayya to romance tamannah
బాలయ్య 101వ సినిమా ఓకే.. తమన్నాకి ఛాన్స్ ?


రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య పక్కన మిల్క్ బ్యూటీ తమన్నా నటించనుందట. ఇప్పటికే చిరంజీవి, నాగార్జునతో కలిసి పనిచేసిన కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌‌ను కొత్తగా చూపించనున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి సమాచారం అధికారికంగా వెలువడనుంది. గతంలో బాలయ్య చేసిన ఫ్యాక్షన్ సినిమాలు సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు, చెన్నకేశవ రెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు అతనికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.