యాప్నగరం

అఫీషియల్: ఇక ఓటీటీలో బంగార్రాజు.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Bangarraju OTT Release date: జనవరి 14న విడుదలై సూపర్ సక్సెస్ సాధించిన 'బంగార్రాజు' సినిమా ఓటీటీలో రాబోతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.

Samayam Telugu 9 Feb 2022, 8:30 pm
ఈ సంక్రాంతికి థియేటర్లలో హంగామా చేశారు అక్కినేని హీరోలు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగార్జున సరనస రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి ఆడిపాడింది.
Samayam Telugu అఫీషియల్: ఇక ఓటీటీలో బంగార్రాజు
Bangarraju Ott


'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వల్‌గా వచ్చిన 'బంగార్రాజు' సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌ థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ నెల 18వ తేదీ నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయిన వారికి మళ్లీ చూడాలనుకున్న వారికి ఇది ఉత్సాహాన్ని ఇచ్చే వార్తనే అని చెప్పుకోవచ్చు.
కీర్తి సురేష్‌తో మహేష్ బాబు రొమాంటిక్ స్టిల్! ఇదీ ఫ్యాన్స్‌కి కిక్కంటే..
అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు నాగార్జున ఓ నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జున మనవడిగా నాగ చైతన్య కనిపించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ మూవీ విడుదలయ్యాక అదే లెవెల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 39.61 కోట్లు వసూలయ్యాయి. ఈ మూవీ విజయం పట్ల చిత్ర యూనిట్ మొత్తం ఆనందంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.