యాప్నగరం

చిరంజీవి గారు ఫోన్‌ చేసి మాట్లాడారు.. మొదటిసారి భయమేసింది: సంచలన నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇకపై తాను సినిమాలు చేయనని చెప్పేశారు.

Samayam Telugu 8 Jul 2020, 3:38 pm
కేవలం మాటలతోనే సంచలనం సృష్టించగలడు బండ్ల గణేష్. సినీ నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో అవతారాల్లో కనిపించే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన విషయాలు బయటపెట్టారు. సదరు ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu ఇక సినిమాలు చేయనంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
Bandla Ganesh


ఈ వీడియోలో బండ్ల గణేష్ ప్రస్తావించిన విషయాలు, సినీ రంగం, రాజకీయ రంగంపై ఆయన చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి, తనకు కరోనా వచ్చినప్పుడు చిరంజీవిగారు చేసిన ఫోన్ గురించి.. ఇలా అనేక విషయాలను ఆయన వెల్లడించారు.

Also Read: మరణం లేని మహానేత వైఎస్ఆర్.. సీఎం జగన్ పోస్ట్‌పై బండ్ల గణేష్ రియాక్షన్

చిరంజీవి గారు తనకు ఫోన్ చేసి 10 నిమిషాలపైన మాట్లాడారని చెప్పారు బండ్ల గణేష్. తానెప్పుడూ భయపడలేదని, మొదటిసారి కరోనా వచ్చినప్పుడు అంత భయపడిపోయానని అన్నారు. వచ్చే ఎలక్షన్స్‌లో టీడీపీ, వైసీపీ, జనసేన ఏ పార్టీలోకి వెళ్ళేది లేదని అన్నారు. ముఖ్యంగా ఇకపై సినిమాలు చేయనని ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ ప్రోమోలో బాగా హైలైట్ అవుతున్నాయి.

''సరిలేరు నీకెవ్వరు సినిమాలో నేను చేసిన పాత్ర నాకు మంచి పేరు తీసుకురాలేదు. నా ఆప్తులందరూ ఆ పాత్ర ఎందుకు చేశావని తిట్టారు. నేను అలాంటి వేషాలు చేయకూడదు. ఇకపై నేను యాక్టింగ్ చేయను.. చేయదలుచుకోలేదు'' అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఇంటర్వ్యూ ప్రోమో లోనే ఇన్ని విషయాలు తెలిశాయంటే ఇక ఫుల్ ఇంటర్వ్యూ వస్తే ఆ సెన్సేషన్ ఎలా ఉంటుందనేది మాటల్లో చెప్పలేం!.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.