యాప్నగరం

IT Raids In Bangalore: సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు

గురువారం ఉదయం నుంచి బెంగళూరు సహా పలుచోట్ల సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు. శాండల్‌వుడ్ టాప్ హీరోలు, బడా నిర్మాతల ఇళ్లలో ముమ్మర తనిఖీలు.

Samayam Telugu 3 Jan 2019, 3:14 pm

ప్రధానాంశాలు:

  • ప్రముఖు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు
  • మొత్త 60చోట్ల తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు
  • ఐటీ దాడులతో షాక్‌లో శాండిల్‌వుడ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
కన్నడ సినీ ప్రముఖు ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు బెంగళూరు సహా పలుచోట్ల సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్, ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్, నటుడు సుదీప్.. కేజీఎఫ్ మూవీ హీరో యశ్, నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌.. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఇళ్లలో ఈ తనిఖీలు చేస్తున్నారు.
కర్ణాటకవ్యాప్తంగా సినీ ప్రముఖులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 60 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల సడెన్ రైడ్లతో శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు షాక్ తిన్నారు. ఐటి అధికారుల దాడుల్లో ఏం దొరికాయి.. ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనది తెలియాల్సి ఉంది. అధికారులు కూడా ఈ సోదాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సినీ ప్రముఖులంతా భారీ బడ్జెట్ సినిమాలు తీసిన హీరోలు, నిర్మాతలే. కేజీఎఫ్ ఈ మధ్యే బంపర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో కూడా దుమ్ము దులిపింది. ఇక నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కూడా కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా సినిమాలు తీశారు. అలాగే ఎన్నో హిట్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.
Read This Stroy In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.