యాప్నగరం

బ్రోతల్ ఓనర్‌గా విద్యాబాలన్ విశ్వరూపం!

‘డర్టీపిక్చర్’ సినిమాతో తనలోని రెండోకోణాన్ని బయటపెట్టి విలక్షణనటిగా గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్.

TNN 14 Mar 2017, 6:30 pm
‘డర్టీపిక్చర్’ సినిమాతో తనలోని రెండోకోణాన్ని బయటపెట్టి విలక్షణనటిగా గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బేగం జాన్’. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీ మహిళల జీవితం ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతోంది. బెంగాలీ సినిమా ‘రాజ్‌కహిని’ ఆధారంగా శ్రీజిత్‌ ముఖర్జీ హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో ప్రధాన పాత్ర అయిన బేగం జాన్ అనే మహిళ బ్రోతల్ హౌస్‌ను నడుపుతుంది. అదే పేరును హిందీలో సినిమా టైటిల్‌గా వాడుకున్నారు. బేగం జాన్ పాత్రలో విద్యాబాలన్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించనుంది. ఈ నేపథ్యంలో విద్యాబాలన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బేగం జాన్’ ట్రైలర్ మంగళవారం విడుదలైంది.
Samayam Telugu begum jaan trailer vidya balan will stun you as the fiery and fearless brothel owner
బ్రోతల్ ఓనర్‌గా విద్యాబాలన్ విశ్వరూపం!


ఫస్ట్ లుక్‌తోనే అభిమానులను కట్టిపడేసిన విద్యాబాలన్.. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ అప్పటి వేశ్యల పరిస్థితిని కళ్లకు కట్టింది. ట్రైలర్‌లోనే ఇంత డెప్త్ ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఆలోచించకమానం. యదార్థ సంఘనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నజీరుద్దిన్ షా, ఆశిష్ విద్యార్థి, గౌహర్ ఖాన్, రజిత్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్ స్వరాలు అందించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.