యాప్నగరం

భానుప్రియ మాజీభర్త హఠాన్మరణం

నటి భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ గుండెపోటుతో ఇటీవలే మరణించినట్టుగా తెలుస్తోంది.

TNN 3 Feb 2018, 10:46 am
నటి భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ గుండెపోటుతో ఇటీవలే మరణించినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఆయన మరణించారనే విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భానుప్రియ తన వ్యక్తిగత విషయాలను మీడియాకు దూరంగా ఉంచుతుండటంతో ఈ విషయంపై సమాచార జాప్యం జరిగింది. అతడితో విడిపోయి చాలాకాలమే అయినప్పటికీ ఆయన మరణం నేపథ్యంలో భానుప్రియ అమెరికాకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.
Samayam Telugu bhanu priyas ex husband passes away
భానుప్రియ మాజీభర్త హఠాన్మరణం


హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన సమయంలో ఆమె 1998లో ఆదర్శ్ ను వివాహం చేసుకున్నారు. అమెరికా వెళ్లిపోయారు. ఈ జంటకు ఒక కూతురు కూడా పుట్టింది. అయితే విబేధాల నేపథ్యంలో వీరు 2005లో విడిపోయారు.

అప్పటి నుంచి భానుప్రియ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తల్లి పాత్రలతో బిజీ అయిపోయారు. చెన్నైలో సెటిలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.