యాప్నగరం

Mahesh Babu స్టామినా ఇది.. ‘భరత్’ బాక్సాఫీస్ రికార్డుల మోత

సీఎం భరత్ బాక్సాఫీస్ కలెక్షన్ల రేసులో దూసుకెళ్తున్నాడు. తొలి వారాంతంలో మహేశ్ బాబు సినిమా కళ్లు చెదిరే రీతిలో వసూళ్లు రాబట్టింది.

Samayam Telugu 23 Apr 2018, 11:05 am
సీఎం భరత్ బాక్సాఫీస్ కలెక్షన్ల రేసులో దూసుకెళ్తున్నాడు. తొలి వారాంతంలో మహేశ్ బాబు సినిమా రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. రెండో రోజే రూ.100 కోట్ల్ క్లబ్‌లో చేరిన భరత్.. ఆదివారం కూడా అదే దూకుడు కనబరిచాడు. గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకుపైగా థియేటర్లలో సూపర్ స్టార్ సినిమా విడుదలైంది. పాజిటివ్ టాక్ రావడంతో.. తొలి వారాంతంలో నాన్ బాహుబలి రికార్డులను భరత్ చెరిపేశాడు.
Samayam Telugu ban mahesh


కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత దూకుడుగా కలెక్షన్లు రాబడుతోంది. శనివారం నాటికే ఈ చిత్రం అమెరికాలో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రంగస్థలం రికార్డులను బ్రేక్ చేసింది. బాహుబలి చిత్రాల తర్వాత వేగంగా యూఎస్‌లో ఆ మార్క్‌ను చేరుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆస్ట్రేలియాలోనూ ‘భరత్’ సత్తా చాటాడు. 2018లో భారీగా వీకెండ్ ఓపెనింగ్స్ సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మహేశ్ మూవీ రెండో స్థానంలో నిలిచింది. భరత్ అనే నేను చిత్రం తొలి వారాంతంలో 339,133 ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ ఫస్ట్ వీకెండ్‌లో 289,768 డాలర్లు రాబట్టింది.

ఈ ఏడాది విడుదలైన పద్మావత్ ఆస్ట్రేలియాలో తొలి వారాంతంలో 1,728,642 ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టింది. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. కానీ భరత్ మాత్రం తెలుగులోనే విడుదలైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.