యాప్నగరం

సీఎం భరత్: నాలుగేళ్ల కిందట ఏపీలో..

‘ఫస్ట్ ఓథ్’ ఆడియో విడుదల ముందే దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. కల్పిత రాజకీయ కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు.

TNN 27 Jan 2018, 3:39 pm
‘భరత్ అనే నేను’ అంటూ వస్తున్న మహేష్ బాబు.. ఇందులో స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున రోటిన్‌కు భిన్నంగా కేవలం వాయిస్‌తో పలకరించిన మహేష్ బాబు.. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అందులో ప్రస్తావించడం సోషల్ మీడియాలో చర్చనీయమైంది.
Samayam Telugu bharat ane nenu mahesh babu is the cm in united andhra pradesh
సీఎం భరత్: నాలుగేళ్ల కిందట ఏపీలో..


అయితే, దీనిపై ఎలాంటి గందరగోళం వద్దని నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. ‘‘మహేష్ బాబు ప్రమాణం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే, కానీ ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌‌కు కాదు. నాలుగేళ్ల కిందటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’’ అని పేర్కొన్నారు. ‘ఫస్ట్ ఓథ్’ ఆడియో విడుదల ముందే దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. కల్పిత రాజకీయ కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు.
Also Read: ​ మహేష్ ఫ్యాన్స్‌కి ఆడియో సందేశం!
ఇందులో సీఎం భరత్ గర్ల్ ఫ్రెండ్‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.