యాప్నగరం

ఆస్ట్రేలియాలో దుమ్మురేపుతున్న రంగస్థలం, భరత్ అనే నేను

భారతీయ సినిమాలంటే హిందీ చిత్రాలే అని భావించే ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను సత్తా చాటుతున్నాయి.

Samayam Telugu 22 Apr 2018, 1:10 pm
ఈ వేసవి కానుకగా విడుదలైన రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తున్నాయి. ఇంటా బయటా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నాయి. యూఎస్‌లో రంగస్థలం ఇప్పటికే 3.4 మిలియన్ డాలర్లు రాబట్టగా.. భరత్ రెండు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఆస్ట్రేలియాలోనూ ఈ రెండు సినిమాలు టాలీవుడ్ సత్తా చాటుతున్నాయి.
Samayam Telugu BAN Rangasthalam


ఇప్పటి వరకూ కంగారుల గడ్డ మీద భారతీయ చిత్రాల్లో హిందీ, పంజాబీ చిత్రాలదే హవా. బాహుబలి మాత్రమే అక్కడ దూసుకెళ్లింది. కాగా.. రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు సీన్ మార్చేశాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టాప్ 5 ఓపెనింగ్ వీకేండ్ గ్రాసర్స్ జాబితాలో చెర్రీ, మహేశ్ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. హిందీ నుంచి పద్మావత్, బాఘీ2 చిత్రాలతోపాటు పంజాబీలో సజ్జన్ సింగ్ రంగ్రూత్ ఈ జాబితాలో ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో తెలుగు సినిమా ఈ స్థాయిలో సత్తా చాటడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బిజినెస్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇక్కడ తొలి వారాంతం అత్యధిక కలెక్షన్లలో రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో భరత్ అనే నేను రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. పద్మావత్ తర్వాతి స్థానంలో మహేశ్ మూవీ నిలవనుందని చెప్పాడు.

ఈ మూవీ శుక్రవారం 168,194 (ఆస్ట్రేలియన్) డాలర్లు, శనివారం 38 లొకేషన్లలో 116,017 (ఆస్ట్రేలియన్) డాలర్లను రాబట్టిందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.