యాప్నగరం

మధ్యలోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమా షూటింగ్

మహేష్ బాబు హీరోగా సెట్స్‌పై వున్న భరత్ అను నేను సినిమా షూటింగ్ ప్రస్తుత షెడ్యూల్ ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో...

TNN 19 Aug 2017, 6:51 pm
మహేష్ బాబు హీరోగా సెట్స్‌పై వున్న భరత్ అను నేను సినిమా షూటింగ్ ప్రస్తుత షెడ్యూల్ ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగాల్సి వుంది. లక్నోలోని మూసాబాగ్, జహంగిరాబాద్ ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాల్లో పలు కీలక సన్నివేశాల షూటింగ్ చేయాల్సి వుండగా అంతకన్నా ముందుగానే ఈ సినిమా షూటింగ్ అడ్డుకున్నారు అక్కడి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్న నేపథ్యంలో షూటింగ్ కారణంగా చారిత్రక కట్టడాలు దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు అనే భయంతో అధికారులు ఈ షూటింగ్‌కి అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఈ నెల 22 వరకు జరగాల్సి వున్న కీలకమైన ఈ మేజర్ షెడ్యూల్‌ని మధ్యంతరంగానే ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారు యూనిట్ సభ్యులు.
Samayam Telugu bharat anu nenu shoot disturbed in lucknow
మధ్యలోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమా షూటింగ్


కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అను నేను సినిమాలో మహేష్ బాబు ఓ రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వాని జంటగా నటిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.