ఇప్పటికే పలు తమిళ అతివాద పార్టీలు రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డుకు ఎక్కాయి. తమిళనాడుని తమిళుడే పాటించాలన్న నినాదంతో ఆ పార్టీలు ఆందోళనలు మొదలుపెట్టాయి. రజనీకాంత్ ఇంటి ముట్టడి, వివిధ చోట్ల ఆయన దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు నిర్వహించాయి ఆ పార్టీలు. ఇక సినీ రంగం నుంచి కూడా పలువురు రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరో తమిళ సినీ ప్రముఖుడు రజనీ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారు. ప్రాంతీయతను ప్రస్తావిస్తూ ఈయన రజనీ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకించడం గమనార్హం. ఆయన మరెవరో కాదు.. తమిళ దర్శక దిగ్గజం భారతీ రాజా. రజనీకాంత్ తో కూడా పలు సినిమాలను రూపొందించిన దర్శకుడీయన. అయితే ఇప్పుడు రజనీ రాజకీయ ప్రవేశాన్ని మాత్రం భారతీరాజా వ్యతిరేకిస్తున్నారు. రజనీ అస్సలు తమిళుడు కాదు.. అని ఈ దర్శకుడు అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని తమిళుడే అధిష్టించాలని.. మరో రాష్ట్ర పీఠాన్ని తమిళుడు అధిష్టించలేడు కదా.. అందుకే, రజనీ విషయంలో యువత సంఘటితం కావాలి. ఆయన రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకించాలి.. అని భారతీ రాజా పిలుపునిచ్చారు. మరి రజనీతో సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు ఈ విధంగా పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. తమిళ సినీ పరిశ్రమలో కూడా ప్రాంతీయత అంశం ఆధారంగా రజనీ రాజకీయ ప్రవేశంపై వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతోంది.