యాప్నగరం

విజయ్ దేవరకొండ నా వాడు.. అప్పట్నుంచే మేమిద్దరం అలా: అభిజిత్

హీరో విజయ్ దేవరకొండ తనకు స్నేహితుడడని, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి తమ మధ్య స్నేహం కొనసాగుతోందని చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్

Samayam Telugu 23 Dec 2020, 7:37 pm
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిభావంతుడని, ప్రతి సినిమాలోనూ అమోఘమైన నటన కనబర్చుడతాడని ప్రశంసించాడు బిగ్‌బాస్-4 విజేత అభిజిత్. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అభిజిత్.. విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ నా వాడు, నా స్నేహితుడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్, తాను తరచు మాట్లాడుకుంటామని తెలిపాడు.
Samayam Telugu Image


Also Read: మెగాస్టార్‌ని కలిసిన మంచువారబ్బాయి.. ఏంటి కథ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో తాను, విజయ్ కలిసి నటించామని అభిజిత్ గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులేనని, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ వారి సొంత గ్రాఫ్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో అభిజిత్ హీరోగా నటించగా.. విజయ్ దేవరకొండ నెగెటివ్ ఛాయలుండే చిన్న పాత్రలో మెరిశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అభిజిత్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అతడికి మద్దతుగా విజయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: నేను ‘మయూరి’గానే గుర్తుండిపోయా... ఆ హీరోపై చెప్పులు విసిరారు: సుధాచంద్రన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.