యాప్నగరం

Ashu Reddy : బాత్ టబ్బులో బిగ్ బాస్ బ్యూటీ.. ప్రైవేట్ పిక్స్ షేర్ చేసిన అషూ రెడ్డి

Ashu Reddy అషూ రెడ్డి తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. స్నానం చేస్తున్న సమయంలో బాత్ టబ్బులో దిగిన ఫోటోలను అషూ రెడ్డి షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.

Authored byబండ కళ్యాణ్ | Samayam Telugu 27 Jun 2022, 6:14 pm

ప్రధానాంశాలు:

  • బిగ్ బాస్ బ్యూటీ సందడి
  • నెట్టింట్లో అషూ రెడ్డి హల్చల్
  • బాత్ టబ్బులో బ్యూటీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బాత్ టబ్బులో బిగ్ బాస్ బ్యూటీ.. ప్రైవేట్ పిక్స్ షేర్ చేసిన అషూ రెడ్డి
Ashu Reddy Bath Tub
అషూ రెడ్డి (Ashu Reddy) తన ఫోటో షూట్లతో నెట్టింట్లో పుట్టించే మంటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె షేర్ చేసే ఫోటో షూట్ల మీద ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. నెటిజన్లు ట్రోల్ చేయడం.. వాటి మీద అషూ తిరిగి కౌంటర్లు వేయడం.. అది మరింత కాంట్రవర్సీకి దారి తీయడం జరుగుతుంటుంది. అయితే తాజాగా అషూ రెడ్డి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. బాత్ టబ్బులో(ashu reddy bath tub pics) స్నానం చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu)

అషూ రెడ్డి స్నానం చేస్తుండగా దిగిన ఈ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. అలా ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. కొన్ని క్యాప్షన్స్ ఇచ్చింది. వాటిని హ్యాష్ ట్యాగ్ రూపంలో పెట్టేసింది. ఎంతో ఆహ్లాదకరమైన కలలు, షవర్ థాట్స్.. సేవ్ వాటర్ అంటూ ఇలా హ్యాష్ ట్యాగులతో దుమ్ములేపేసింది. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం బాత్ టబ్ పిక్స్‌తో నెట్టింట్లో మంటలు పుట్టించేస్తోంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో అషూ రెడ్డిని అందరూ తెగ ఏడిపించేవారు. స్నానం చేయదు.. శుభ్రంగా ఉండదు.. నోరు కూడా కడుక్కోదు అంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్స్ చేసేవారు. ఇక నాగార్జున సైతం అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుండేవాడు. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం బుల్లితెర, వెండితెరపై బాగానే క్రేజ్ సంపాదించుకుంటోంది.

ప్రస్తుతం అషూ రెడ్డి తన బిగ్ బాస్ మేట్స్ అయిన అజయ్, స్రవంతిలతో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఈ ముగ్గురూ కలిసి గోవాకు చెక్కేసినట్టు అనిపిస్తోంది. మొన్న అషూ రెడ్డి షేర్ చేసిన రీల్ వీడియో, అందులో మందు, చిందులు చూసి అందరూ పరేషాన్ అయ్యారు. ఇక పొట్టి బట్టల్లో గోవా బీచుల వెంట తిరుగుతూ నానా హంగామా చేసేస్తున్నారు.
రచయిత గురించి
బండ కళ్యాణ్
బండ కళ్యాణ్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయం, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.