యాప్నగరం

‘బిగ్‌బాస్’ జీవిత పాఠాలు నేర్పింది.. వాళ్లకు నాపై ఇంత ప్రేమ ఉందా: అభిజిత్

బిగ్‌బాస్ విన్నర్ కావడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమని, ప్రేక్షకులు తనపై ఇంత ప్రేమ కురిపిస్తారనుకోలేదని అభిజీత్ అన్నాడు. కుటుంబం, స్నేహితులు ఎంత ముఖ్యమో బిగ్‌బాస్ ద్వారా తెలుసుకున్నానన్నారు.

Samayam Telugu 23 Dec 2020, 8:07 am
‘బిగ్‌బాస్’ హౌస్ తనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పించిందని చెబుతున్నాడు సీజన్-4 విజేత అభిజిత్. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్.. తాజాగా బిగ్‌బాస్-4 టైటిల్‌ను ఎగరేసుకునిపోయాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘జీవితంలో కొన్ని అనూహ్యంగా జరుగుతుంటాయి. ఆ సందర్భాల్లో మనం ఎలా స్పందిస్తాం?.. ఎవరితో ఎలా ఉంటాం? అనేదే ముఖ్యం’ అంటూ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu అభిజిత్


Also Read: మెగాస్టార్‌ని కలిసిన మంచువారబ్బాయి.. ఏంటి కథ?

‘ బిగ్‌బాస్ విజేతగా నిలిచాననే ఆనందం కంటే, ఇంత మంది ప్రేమని సొంతం చేసుకున్నాను.. అన్న విషయమే నాకు సంతోషాన్నిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు ఉంటాయి. బిగ్‌బాస్ విన్నర్‌ని కావడం నాకు భిన్నమైన అనుభవం. నాపై ప్రేక్షకులకు ఇంత ప్రేమ, అభిమానం ఉందా? అని ఆశ్చర్యం కలిగింది. కుటుంబం, స్నేహం ఎంత ముఖ్యమో బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు బాగా అర్థమైంది. బయటికొచ్చాక నా స్నేహితులు, నా వాళ్లు నా పక్కనే ఉండాలనిపిస్తుంది’

Also Read: ఘనంగా ఎన్టీఆర్ మనవడి పెళ్లి.. వైరల్‌గా మారిన ఫోటోలు

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటికి రాగానే రోజంతా అమ్మా నాన్న, నాన్నమ్మ, నా పెంపుడు కుక్క రౌడీతోనే గడిపా. సినిమానే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇకపై మళ్లీ సినిమాలతో బిజీ అవుతా’ అన్నాడు అభిజిత్. బిగ్‌బాస్‌ విన్నర్‌గా అభిజిత్‌కు వచ్చిన క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు టాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు ఆయన్ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. తమ సినిమాల్లో నటించాలని అడ్వాన్సులు కూడా పంపిస్తున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.