యాప్నగరం

‘బిగ్ బాస్’ బాబు గోగినేనికి ఝలక్!! అరెస్ట్ తప్పదా?

బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని చుట్టూ పోలీసుల ఉచ్చు బిగిస్తోంది.

Samayam Telugu 19 Jul 2018, 5:04 pm
బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని చుట్టూ పోలీసుల ఉచ్చు బిగిస్తోంది. దేశద్రోహం, ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఇతరుల ఆధార్ సమాచారాన్ని పక్క దేశాలకు అందజేయడం, హేతువాద ప్రచారం కోసం విదేశాల నుండి నిధులు సేకరణ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై ఇటీవల ఐపీసీ సెక్షన్ 121, 121ఏ, 153 ఏ, 53 బీ, 406, 420, 504, 505, 295 ఏ, 292, 293 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu బాబు గోగినేని


రెండు వర్గాల మధ్య మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా బాబు గోగినేని వ్యవహరించారని గతంలో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆయనపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించడంతో స్పందించిన కోర్టు ఈనెల 25వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించారు.

దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2లో బలమైన కంటెస్టెంట్‌గా ఉన్న బాబు గోగినేనికి నోటీసులు అందించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం బిగ్‌బాస్‌ షో నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ఎలిమినేట్ అయితే తప్ప బిగ్ బాస్ హౌస్ నుండి కంటెస్టెంట్స్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే బిగ్ బాస్ సీజన్1లో ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరైంది. ఇదే తరహాలో బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు రావాల్సి ఉంటుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో బాబు గోగినేని అరెస్ట్ తప్పదనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.