యాప్నగరం

‘మణికర్ణిక’కు మళ్లీ గాయాలు!

బాలీవుడ్ అందాల నటి కంగనా రనౌత్ షూటింగ్‌లో గాయపడ్డారు. ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీలో కంగనా లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.

TNN 22 Nov 2017, 9:08 pm
బాలీవుడ్ అందాల నటి కంగనా రనౌత్ షూటింగ్‌లో గాయపడ్డారు. ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీలో కంగనా లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోధ్‌పూర్‌లో జరుగుతుంది. మంగళవారం ఉదయం కంగనా రనౌత్‌పై స్టంట్స్ సీన్ చిత్రీకరిస్తుండగా.. కంగనా ప్రమాదశాత్తు కిందపడటంతో ఆమె కాలికి గాయమైంది
Samayam Telugu bollywood actress kangana ranaut injured on the sets of manikarnika
‘మణికర్ణిక’కు మళ్లీ గాయాలు!


దీంతో దగ్గరలోని హాస్పటల్‌కు కంగనాను తరలించడంతో ఎత్తునుండి కింద పడటంతో కాలికి గాయమైందని అయితే పెద్ద ప్రమాదం ఏం లేదని కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఓ ఛేజింగ్‌ సీన్‌లో గుర్రం మీద నుండి కిందపడటంతో కంగనాకు గాయాలయ్యాయి. దీంతో కొన్నాళ్లు షూటింగ్‌కి బ్రేక్ పడింది. కాగా మళ్లీ ‘మణికర్ణిక’షూటింగ్‌లో గాయపడటంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.