యాప్నగరం

#MeToo:పక్క గదిలోనే తల్లి.. బట్టలు విప్పమన్నాడు, సాజిద్‌పై సిమ్రన్ ఆరోపణలు

బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేసిన నటి సిమ్రన్ సూరి.. ఇంటికి పిలిపించి.. మాటల్లో కూడా చెప్పలేని విధంగా ప్రవర్తించాడన్న సిమ్రన్.

Samayam Telugu 15 Oct 2018, 4:49 pm
దేశంలో #MeToo ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో రోజుకో సెలబ్రిటీ బాగోతం బయటపడుతూనే ఉంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై నటి సిమ్రన్ సూరి సంచలన ఆరోపణలు చేసింది. సినిమా అవకాశాల పేరుతో సాజిద్ తనను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడంటోంది. తన ఇంటికి పిలిపించుకొని తననున బలవంతం చేయబోయాడంటూ పెద్ద బాంబే పేల్చింది.
Samayam Telugu Sajid.


సాజిద్ ఖాన్ తనను హిమ్మత్ వాలా మూవీ కాస్టింగ్ కోసం వెళ్లి సమయంలో వేధించాడంటోంది సిమ్రన్. సాజిద్ ఓ రోజు తన ఇంటికి పిలిస్తే వెళ్లానంది. ట్రెడ్‌మిల్‌పై ఉన్న అతడు.. బట్టలు విప్పి తనతో పడుకోవాలని బెదిరించాడంది. అతడి మాటలతో షాక్ తిన్న తాను.. అలాగే నిలబడిపోయానంది. అంతటితో ఆగని సాజిద్.. తన దగ్గరకు వచ్చి.. తన టాప్‌ను పైకి ఎత్తి.. గట్టిగా అరవొద్దు.. పక్క గదిలో తన తల్లి ఉందని బెదిరించే ప్రయత్నం చేశాడంది.

సాజిద్ చేష్టలతో షాక్ తిన్న తాను.. అతడి చెర నుంచి విడిపించుకొని ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశానంది. తర్వాత అతడి ఫోన్ నెంబర్ కూడా తన మొబైల్ నుంచి తొలగించానంది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా నమ్మరనే.. ముందు బయటపెట్టలేదంది. అందుకే #Me Too ఉద్యమం ద్వారా తనకు ఎదురైన వేధింపుల్ని ధైర్యంగా బయటపెట్టానంది సిమ్రన్ సూరి. సాజిద్‌ ఖాన్‌పై ఇప్పటికే నలుగురు సెలబ్రిటీలు ఆరోపణలు చేయగా.. సిమ్రన్ చేసిన తాజా ఆరోపణలు బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.