యాప్నగరం

Casting Couch: ఆ నిర్మాత నన్ను గదిలోకి రమ్మన్నాడు: విద్యా బాలన్

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఓ తమిళ సినిమా నిర్మాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Samayam Telugu 28 Aug 2019, 3:18 pm
‘సినిమా గురించి మాట్లాడటానికి ఓ తమిళ సినిమా నిర్మాత నన్ను గదిలోకి రమ్మన్నాడు’ అంటూ తనకు ఎదురైన షాకింగ్ సంఘటన గురించి బయటపెట్టారు బాలీవుడ్ నటి, విద్యా బాలన్. కెరీర్ తొలినాళ్లలో తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తప్పించేసేవారని తెలిపారు. ఓ నిర్మాత సినిమా గురించి మాట్లాడాలని చెప్పి పబ్లిక్ ప్లేసెస్‌కు రమ్మనకుండా ఏకంగా గదిలోకే రమ్మన్నాడని పేర్కొన్నారు.
Samayam Telugu vidya


‘తమిళంలో దాదాపు 14 సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. ఓసారి ఫోన్‌లోనే సినిమాకు ఓకే చేశాను. చిత్రీకరణ నిమిత్తం చెన్నై వెళ్లాను. కొన్ని సన్నివేశాల్లో నటించాను. కానీ నాకు అసౌకర్యంగా అనిపించింది. దాంతో సినిమా నుంచి తప్పుకొన్నాను. దాంతో చిత్రబృ ందం నాకు నోటీసులు పంపించి. మరో సంఘటనలో ఓ దర్శకుడు స్క్రీన్‌లో నన్ను చూసి ‘హీరోయిన్‌కు ఉండాల్సిన అందం లేదు’ అని నా తల్లిదండ్రుల ఎదుటే అవమానించాడు’

‘దాంతో నేను చాలా నెలల పాటు నన్ను నేను అద్దంలో చూసుకోలేకపోయా. నాపై నాకే అసహ్యం వేసేది. చాలా రోజుల పాటు నాపై కామెంట్స్ చేసిన దర్శకుడిని క్షమించలేకపోయాను. ఓసారి ఎవరో నా గురించి కామెంట్స్ చేస్తూ.. ‘ఇలాంటి దుస్తులేసుకుంటే బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే కూర్చోవచ్చు’ అన్నాడు. ఆ మాటల్ని చాలా నెలల పాటు మర్చిపోలేకపోయాను. నాకు ఆ కామెంట్స్ కలలోకి కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు అసలు వాటి గురించి పట్టించుకోవడమే లేదు’ అని వెల్లడించారు .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.