యాప్నగరం

హృతిక్ నన్ను వాడుకుని వదిలేశాడు!

హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వివాదం ఇక ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని అంతా మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని వెలికి తీసింది కంగనా రనౌత్.

TNN 4 Sep 2017, 9:23 pm
హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వివాదం ఇక ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని అంతా మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని వెలికి తీసింది కంగనా రనౌత్. పాతవివాదం గురించి మాట్లాడుతూ.. అతడే నన్ను ఇష్టపడ్డాడు, అవసరం తీరాక నన్ను మోసం చేశాడు అంటూ కామెంట్స్ చేసింది. హృతిక్ తన భార్య సుసానేతో ఉండగానే తనను ఇష్టపడ్డాడని, వారిద్దరు విడాకులు తీసుకున్న తరువాత కూడా తనను ఇష్టపడుతున్నట్లుగా హృతిక్ చెప్పాడని కానీ కావాలనే తరువాత తనను వదిలించుకున్నాడని దాంతో చాలా బాధ పడ్డానని చెప్పుకొచ్చింది కంగనా.
Samayam Telugu bollywood beauty kangana ranauts boldest statements
హృతిక్ నన్ను వాడుకుని వదిలేశాడు!


అంతేకాదు.. తమ మధ్య ఉన్న బంధం గురించి బయటకు చెప్పినప్పుడు తనకు బెదిరింపులు మొదలయ్యాయని దీంతో మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేస్తే ఆ కమీషన్‌ను కూడా హృతిక్ కుటుంబం కొనేసిందని తెలిపింది. హృతిక్ విషయానికి సంబంధించి ఓ బాలీవుడ్ నటి తనను ఇంటికి పిలిచి.. 'ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయకు, వారు ధనవంతులు, నిన్నేమైన చేయగలరు' అంటూ వార్నింగ్ ఇచ్చిందని హాట్ కామెంట్స్ చేసింది కంగనా. దీంతో ఈ జంట మధ్య ఉన్న మంటలు మరోసారి గుప్పుమన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.