యాప్నగరం

వెంకీ హీరోగా రీమేక్ కానున్న మరో బాలీవుడ్ మూవీ

ఇదే ఏడాది మే నెలలో బాలీవుడ్‌లో రిలీజైన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

TNN 6 Oct 2017, 5:33 pm
ఇదే ఏడాది మే నెలలో బాలీవుడ్‌లో రిలీజైన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇర్ఫాన్ ఖాన్, పాకిస్థానీ నటి సబా ఖమర్ జంటగా నటించిన హిందీ మీడియం సినిమా బాలీవుడ్ విమర్శలు ప్రశంసలు అందుకుని హిట్ సినిమాగా నిలిచింది. ఈ కామెడీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు డైరెక్టర్ నందిని రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Samayam Telugu bollywood movie to be remade in telugu
వెంకీ హీరోగా రీమేక్ కానున్న మరో బాలీవుడ్ మూవీ


ఫిలింనగర్ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. హిందీ వెర్షన్‌లో ఇర్ఫాన్ ఖాన్ పోషించిన పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ పోషించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రీమేక్ కోసం హిందీ మీడియం నిర్మాతలతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కానీ దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన మాత్రం చేయలేదు. అన్నట్టు ఈ రీమేక్‌కి 'తెలుగు మీడియం' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్టు టాక్ వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.