యాప్నగరం

రేప్ కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన సినీ నిర్మాత

చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలని నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ ఓ అత్యాచారం కేసులో హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్..

TNN 23 Sep 2017, 4:33 pm
చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలని నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ ఓ అత్యాచారం కేసులో హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో బెయిల్ కోసం కరీం మొరాని చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించిన తర్వాత కొద్ది గంటల్లోనే శుక్రవారం అర్థరాత్రి అతడు హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటికి చెబితే తన ప్రైవేటు ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని ఢిల్లీకి చెందిన ఓ యువతి కరీం మొరానిపై హయత్‌నగర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu bollywood producer karim morani surrendered before hyderabad police in rape case
రేప్ కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన సినీ నిర్మాత


యువతి ఫిర్యాదుని విచారణకు స్వీకరించిన పోలీసులు గత జనవరి నెలలోనే కరీం మొరానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కరీం మొరానీ బెయిల్‌ని రద్దు చేస్తూ స్థానిక సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలని హై కోర్టు సమర్ధించడాన్ని సవాలు చేస్తూ అతడు సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. కానీ సుప్రీం కోర్టులోనూ కరీం మొరానికి చుక్కెదురైంది. దీంతో ఇక చేసేదేం లేక నిన్న అర్ధరాత్రి వేళ హయత్‌నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.