యాప్నగరం

హీరోయిన్లే బెడ్రూమ్ కొస్తామంటారు: ప్రముఖ నిర్మాత

ఇప్పటి వరకూ సినీ పరిశ్రమలో నిర్మాతల నుంచి హీరోల నుంచి వేధింపులను ఎదుర్కొన్నాం అని ప్రకటించిన హీరోయిన్లను చాలా మంది చూశాం

TNN 19 Feb 2018, 3:36 pm
ఇప్పటి వరకూ సినీ పరిశ్రమలో నిర్మాతల నుంచి హీరోల నుంచి వేధింపులను ఎదుర్కొన్నాం అని ప్రకటించిన హీరోయిన్లను చాలా మంది చూశాం. దశాబ్దాల కిందట తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను కూడా ఇటీవల పలువురు నటీమణులు బయటపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమపై కూడా కొందరు సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తుల పేర్లు చెప్పకుండా.. తమను ఒక హీరో బెడ్రూమ్ కు రమ్మన్నాడని, తాము నిర్మాతల నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని వివరించిన వాళ్లు చాలా మందే ఉన్నారు.
Samayam Telugu bollywood runs on sexual favours ekta kapoor
హీరోయిన్లే బెడ్రూమ్ కొస్తామంటారు: ప్రముఖ నిర్మాత


వాళ్ల సంగతలా ఉంటే.. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయిప్పుడు. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అయిన ఈమె ఏమంటోందంటే.. కొంతమంది హీరోయిన్లే సెక్సువల్ ఫేవర్ చేయడానికి రెడీగా ఉంటారు అని! ఆ హీరోయిన్లే ఈ ప్రతిపాదన తెస్తారు అని ఏక్తా చెబుతోంది.

‘మీ సినిమాలో అవకాశం ఇస్తే.. నేను బెడ్రూమ్ కు రావడానికి సిద్ధం..’ అని కొంతమంది నటీమణులే ప్రతిపాదిస్తారని ఏక్తా చెబుతోంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు.. ఇలా చాలా మందికి ఇలాంటి ఆఫర్లు వస్తాయని ఏక్తా కపూర్ చెప్పింది.

క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసే హీరోయిన్ల నడుమ, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటాయనే అభిప్రాయాల నడుమ ఏక్తా వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయి. ఇలాంటి విషయాల్లో ప్రతిసారీ ఆడవాళ్లనే అనగా హీరోయిన్లనే బాధితులుగా చూడనవసరం లేదని కూడా ఏక్తా స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.