యాప్నగరం

Mohammed Aziz: ఫేమస్ సింగర్ మహ్మద్‌ అజీజ్‌ కన్నుమూత

మూడున్నర దశాబ్దాలపాటు సింగర్‌గా సేవలందించిన అజీజ్ ఇకలేరన్న విషయాన్ని బాలీవుడ్, బెంగాలీ, ఒరియా ఫిల్మ్ ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Samayam Telugu 27 Nov 2018, 11:45 pm
ప్రముఖ గాయకుడు మహ్మద్‌ అజీజ్‌(64) కన్నుమూశారు. ముంబయిలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. కోల్‌కత్తా నుంచి వస్తుండగా కార్డియాక్ అరెస్ట్ అయిన ఆయనను విమానం ల్యాండ్ అయిన వెంటనే సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గాయకుడు తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu Mohammed Aziz


జానీ లెవర్ సోదరు జిమ్మీ మోసెస్ తన ఫేస్‌బుక్ పోస్టుతో ఈ విషాదాన్ని అభిమానులకు తెలిపాడు. ‘మై నేమ్ ఈజ్ లకన్’ లాంటి ఫేమస్ సాంగ్స్ పాడిన అజీజ్.. హిందీ, బెంగాలీ, ఒరియా భాషలలో వేల సంఖ్యలో పాటలు పాడారు. అజీజ్‌‌కు లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ అంటే ప్రాణం. 1984లో వచ్చిన ‘జ్యోతి’ అనే బెంగాలీ సినిమాలో అజీజ్ సింగర్‌ కెరీర్ ప్రారంభించారు.

అదే ఏడాది ముంబయి వెళ్లిన అజీజ్‌ ‘అంబర్‌’ అనే మూవీలో పాటలు పాడారు. ఇక అది మొదలుకుని తన శ్రమ, పట్టుదలతో ఉన్నతశిఖరాలు అదిరోహించారు. మూడున్నర దశాబ్దాలపాటు సింగర్‌గా సేవలందించిన అజీజ్ ఇకలేరన్న విషయాన్ని బాలీవుడ్, బెంగాలీ, ఒరియా ఫిల్మ్ ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.