యాప్నగరం

హీరో సూర్య ఆఫీసుకు బాంబు బెదిరింపు.. చెన్నైలో కలకలం

తమిళ హీరో సూర్య కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫేక్ కాల్ కలకలం రేపింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేసినా బాంబు కనిపించలేదు.

Samayam Telugu 28 Sep 2020, 9:09 pm
తమిళ‌ హీరోలను బాంబు బెదిరింపులు కలవరపరుస్తున్నాయి. ఇటీవల కాలంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, విజ‌య్ త‌దిత‌రుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ పోలీసుల‌కు ఫోన్స్ వ‌చ్చాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ కాల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్యను కేటుగాళ్లు టార్గెట్ చేశారు.
Samayam Telugu హీరో సూర్య


Also Read: డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్లకు షాక్... అప్పటివరకు జైల్లోనే

చెన్నై అల్వార్‌పేట ప్రాంతంలో ఉన్న హీరో సూర్య ఆఫీసులో బాంబు పెట్టినట్లు సోమవారం పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్‌ కాల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: ‘రాధేశ్యామ్’ ‌ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. పూజా పాత్రపై ఆ వార్త నిజమేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.