యాప్నగరం

ఐదు సినిమాలు వచ్చాయ్.. దేని పరిస్థితేంటి?

పెద్ద సినిమాలు పోటీలో లేవు.... ఇలాంటి పరిస్థితుల్లో విడుదల అయ్యే చిన్న సినిమాలకు కలెక్షన్లను రాబట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది.

TNN 24 Feb 2018, 1:03 pm
పెద్ద సినిమాలు పోటీలో లేవు.... ఇలాంటి పరిస్థితుల్లో విడుదల అయ్యే చిన్న సినిమాలకు కలెక్షన్లను రాబట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే..అలా జరగాలంటే.. సదరు సినిమాల్లో సత్తా ఉండాలి. అలా లేనప్పుడు పెద్ద సినిమాలతో పోటీ ఉన్నా లేకపోయినా పరిస్థితి ఒకేలా ఉంటుంది. అందుకు నిదర్శనమే నిన్నటి సినిమాలు. ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. కానీ.. ఏ ఒక్కటీ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగల సత్తా చూపలేకపోయాయి.
Samayam Telugu box office report juvvasketch other movies
ఐదు సినిమాలు వచ్చాయ్.. దేని పరిస్థితేంటి?


అనేక వాయిదాల అనంతరం విడుదల అయిన శ్రీకాంత్ సినిమా ‘రా..రా’ ‘పో.. రా’ అనిపించుకుంది. ఈ సినిమా పట్ల రివ్యూయర్లు పెదవి విరిచారు. ఇక సినీ ప్రముఖుల ద్వారా ప్రమోషన్ ను పొందిన ‘జువ్వ’ పైకి లేవలేదు. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపలేకపోయింది ఈ సినిమా.

మిగతా వాటిల్లో డబ్బింగ్ సినిమా ‘స్కెచ్’ కు బాగానే ప్రచారం చేసినా.. పెద్దగా యూజ్ కనిపించడం లేదు. విక్రమ్ సినిమాలకు తెలుగునాట ఆదరణ తగ్గిపోయిన నేపథ్యంలో ఈ సినిమాను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. తమన్నా బొమ్మను చూపినా ప్రయోజనం అంతంత మాత్రమే. చల్తే చల్తే, హైదరాబాద్ లవ్ స్టోరీ అనే మరో రెండు సినిమాలు వచ్చినా.. అవి కూడా ప్రేక్షకులు ఆసక్తిని రేపడంలో విజయవంతం కాలేదు.

ఓవరాల్ గా ఐదు సినిమాలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా లేవు. మరోవైపు ‘అ!’‘తొలిప్రేమ’లు కలెక్షన్ల జోరును కొనసాగిస్తూ ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.