యాప్నగరం

బోయపాటి శ్రీను కొత్త సినిమా టైటిల్ లాంచ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సరైనోడు సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సినిమాకి...

Samayam Telugu 18 Jun 2017, 12:43 pm
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సరైనోడు సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సినిమాకి తాజాగా టైటిల్ ఫిక్స్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'జయ జానకి నాయక' అనే టైటిల్‌ని లాంచ్ చేశారు మూవీ మేకర్స్. బోయపాటి స్టైల్లోనే రూపొందుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సాయి శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ వంటి హీరోయిన్స్‌ నటిస్తున్నారు.
Samayam Telugu boyapati sreenus upcoming film title revealed
బోయపాటి శ్రీను కొత్త సినిమా టైటిల్ లాంచ్


మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దాదాపు టాలీవుడ్ బిగ్గీస్‌తో కలిసి పనిచేస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. టాలీవుడ్ లక్కీ మస్కట్‌గా పేరున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈసారి బెల్లంకొండకి లక్‌ని తీసుకొస్తుందో లేదో తెలియాలంటే, ఆగస్టు 11న ఈ సినిమా రిలీజయ్యే వరకు వేచిచూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.