యాప్నగరం

చెర్రీ-బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్!

రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ 'రంగస్థలం' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

TNN 20 Nov 2017, 9:17 pm
రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ 'రంగస్థలం' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే జనవరి నాటికి మొత్తం షూటింగ్ అయితే పూర్తయిపోతుంది. చరణ్ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu boyapati srinu and ram charan movie latest updates
చెర్రీ-బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్!


ఇటీవలే సినిమా స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. బోయపాటి స్టయిల్‌లో ఉండే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే దర్శకుడు బోయపాటి వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు.

నిజానికి అప్పటికి చరణ్ బిజీ ఉంటాడో.. లేదో.. అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో చరణ్, బోయపాటికి ఏ విషయం చెప్పలేదట. కానీ బోయపాటి మాత్రం జనవరి నెలలో సినిమాను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేసి వెంటనే బాలయ్య సినిమాను మొదలుపెట్టాలనేది బోయపాటి ఆలోచన. నిజానికి బోయపాటి వరుస కమిట్మెంట్స్‌తో బిజీ అయిపోయాడు. బాలయ్య సినిమా తరువాత లైన్‌లో మహేష్ బాబు కూడా ఉన్నాడు. అందుకే చరణ్ సినిమాను తొందరగా మొదలుపెట్టి పూర్తి చేసేస్తే గ్యాప్ తీసుకోకుండా మిగిలిన రెండు సినిమాలు కూడా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.