యాప్నగరం

సమ్మర్ రేసులో బోయపాటి సినిమా?

తెలుగు సినిమా పరిశ్రమలో బోయపాటి శ్రీనుకి మంచి కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుంది.

TNN 16 Apr 2017, 6:48 pm
తెలుగు సినిమా పరిశ్రమలో బోయపాటి శ్రీనుకి మంచి కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుంది. ఆయన ఏ హీరోతో సినిమా తీసినా పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేస్తారు. స్టైలిస్‌గా ఉండే అల్లు అర్జున్‌ను ‘సరైనోడు’లో ఎంత రఫ్‌గా చూపించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ మాస్ డైరెక్టర్ నిర్మాత బెల్లకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్‌‌ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు.
Samayam Telugu boyapati srinus new movie with bellamkonda srinivas will be hit screens this summer
సమ్మర్ రేసులో బోయపాటి సినిమా?


‘లెజెండ్’, ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా చేస్తుండటం ఆశ్చర్యకరమే అయినా బోయపాటి వల్ల ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ వేసవిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

గతేడాది చివర్లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బోయపాటి గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో సుధీర్ఘంగా సాగిన షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. దీంతో షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి కృష్ణా జిల్లా దివి సీమలోని హంసలదీవిలో చివరి షెడ్యూల్‌ను బోయపాటి ప్లాన్ చేశారట. అక్కడి సముద్ర తీరంలో భారీ సెట్ వేసి ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి.. మే నెలాఖర్లో లేదా జూన్ ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనివాస్‌కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, శరత్‌కుమార్ ఇలా భారీ తారాగణమే ఉంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.