యాప్నగరం

Green India Challenge: ఉదయభాను సవాల్ స్వీకరించిన బ్రహ్మానందం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను.. బ్రహ్మానందాన్ని నామినేట్ చేసింది. దీంతో ఈ ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మానందం మణికొండ లోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటారు.

Samayam Telugu 27 Jun 2020, 11:41 am
పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నడుస్తోంది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం ప్రసాదించడమే లక్ష్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. “పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్‌లో ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం భాగమయ్యారు.
Samayam Telugu Green India Challenge_ ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మానందం
Brahmanandam Udayabhanu


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను.. బ్రహ్మానందాన్ని నామినేట్ చేసింది. దీంతో ఈ ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మానందం మణికొండ లోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Bigg Boss 4 Telugu Host: బిగ్ ట్విస్ట్.. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున కాదు సమంతనా?

ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను కేటీఆర్‌, కవిత, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, ప్రభాస్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి లాంటి ఎందరో సెలబ్రిటీలు స్వీకరించి పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యారు. వీళ్లందరినీ ఆదర్శంగా తీసుకొని సాధారణ ప్రజలు సైతం మొక్కలు నాటుతూ హరితహారంలో పాలు పంచుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.