యాప్నగరం

‘బుచ్చినాయుడు కండ్రిగ, తూర్పు వీధి’లో ప్రేమ, పగ, ప్రతీకారం

నా అరుపు వెనుక మీకు మీకు నా కోపం కనపడుతున్నాది.. కాని నాకు నా గతం కనపడుతున్నాది అంటున్నాడు బుజ్జినాయుడు. ఇంతకీ అతని గతం ఏంటో తెలియాలంటే ఈ టీజర్‌పై ఓ లుక్కేయండి.

Samayam Telugu 15 Aug 2020, 11:17 pm
‘బుచ్చినాయుడు కండ్రిగ, తూర్పు వీధి’.. ఇంత పొడుగు ఉందేంట్రా బాబూ ఎంతకీ ఇది ఎవరి అడ్రస్ ఇది అనుకోమాకండే.. పక్కా తెలుగు కంటెంట్‌తో ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో విడుదల కాబోతున్న సినిమా పేరే ‘బుచ్చినాయుడు కండ్రిగ, తూర్పు వీధి’.. టైటిల్‌తో ఆసక్తిరేకెత్తించి ఈ మూవీ టీజర్‌ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతులమీదగా విడుదలైంది.
Samayam Telugu ‘బుచ్చినాయుడు కండ్రిగ, తూర్పు వీధి’ టీజర్
Buchinaidu Kandriga Movie Teaser


మున్నా, దృశిక చందర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై పమిడిముక్కల చంద్రకుమారి నిర్మించారు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర టీజర్‌ ప్రేమ, పగ, పరువు నేపథ్యంలో రొటీన్‌గానే ఉన్నప్పటికీ ఎమోషన్స్‌ బాగా క్యారీ అయినట్టుగానే కనిపిస్తోంది.

రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో హీరో విలక్షణ నటనను ప్రదర్శిస్తుండగా.. హీరోయిన్ చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. అయితే ఈ టీజర్‌లో ఆర్ ఎక్స్ 100 ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామ్ కె మహేషన్ సినిమాటోగ్రఫీ.. మిహిరాంశ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయ్యాయి. ఈనెల 21న ఈ చిత్రాన్ని ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.