యాప్నగరం

Anikha Surendran ని చీర కట్టుకుని రమ్మంటావా? రిపోర్టర్‌కి ‘బుట్టబొమ్మ’ ప్రొడ్యూసర్ కౌంటర్

Butta Bomma Movie రిలీజ్‌కి రెడీ అయిపోయింది. శనివారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. సినిమాలో నటించిన హీరోయిన్ అనికా సురేంద్రన్‌ గురించి ఓ ప్రశ్న ప్రొడ్యూసర్‌కి ఎదురైంది. దాంతో నాగవంశీ తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 28 Jan 2023, 6:02 pm

ప్రధానాంశాలు:

  • ఫిబ్రవరి 4న రాబోతున్న బుట్టబొమ్మ సినిమా
  • ఈరోజు మూవీ ట్రైలర్ రిలీజ్ లాంచ్ ఈవెంట్
  • ఈవెంట్‌లో కొంటె ప్రశ్న అడిగిన రిపోర్టర్
  • ఈ అమ్మాయిని చీర కట్టుకుని రమ్మంటావా? అంటూ ప్రొడ్యూసర్ కౌంటర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Producer Naga Vamsi, Anikha Surendran
హీరోయిన్ అనికా సురేంద్రన్, ప్రొడ్యూసర్ నాగవంశీ
చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందరికీ సుపరిచితమైన అనికా సురేంద్రన్‌ (Anikha Surendran) హీరోయిన్‌గా ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట మెయిన్ రోల్స్‌లో నటిస్తుండగా.. శౌరి చంద్రశేఖర్ రమేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పార్ట్‌నర్ షిప్‌తో సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ ఈ మూవీని నిర్మించింది.
ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ సినిమా వరల్డ్‌వైడ్ రిలీజ్ కాబోతోంది. దాంతో శనివారం ఈ చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ప్రొడ్యూసర్ నాగవంశీ (Producer Naga Vamsi) చిరుకోపం ప్రదర్శించాడు. వాస్తవానికి బుట్టబొమ్మ మూవీ జనవరి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. స్పష్టమైన కారణాలు చెప్పకుండానే మూవీ రిలీజ్‌ని ఫిబ్రవరి 4కి వాయిదా వేశారు. ఇప్పటికే బుట్ట బొమ్మ మూవీ నుంచి రిలీజైన పాట, పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

వేదికపై అనికా సురేంద్రన్‌ మోడ్రన్ డ్రెస్‌లో ఉండటంతో.. ఓ రిపోర్టర్.. హీరోయిన్ డ్రెస్సింగ్ స్టయిల్‌కి సినిమాలో మీరు చూపించబోతున్న క్యారెక్టర్‌కి చాలా వ్యత్యాసం ఉన్నట్లుంది? అని అడిగారు. దానికి నాగవంశీ వెంటనే స్పందిస్తూ.. ‘ఈ అమ్మాయి బుట్టబొమ్మలా లేదా? అంటే ఏంటి మీరు చెప్పేది.. ఈ హీరోయిన్‌ని చీర కట్టుకుని రమ్మంటావా?’ అంటూ కౌంటర్ వేశారు.

మూవీ మొత్తం అనికా సురేంద్రన్‌ చుట్టూ తిరుగుతందని స్పష్టం చేసిన నాగవంశీ.. బుట్టబొమ్మ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. మూడేళ్ల క్రితం ఇదే బ్యానర్‌పై వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీ హిట్ అవగా.. అందులోని బుట్టబొమ్మ పాట కూడా అందరికీ నచ్చింది. దాంతో బుట్టబొమ్మ టైటిల్ బాగుంటుందని పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు. మలయాళం మూవీ ‘కప్పేల’సినిమాకి రీమేక్‌గా బుట్టబొమ్మని తెరకెక్కించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విశ్వక్‌సేన్‌ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.


Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.