యాప్నగరం

మహేశ్‌... ప్రిన్స్‌ ఆఫ్ ఓవర్సీస్, సత్తా ఇది!

వరసగా రెండు సినిమాలు డిజాస్టర్లే అయినా ఓవర్సీస్‌లో మహేశ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Samayam Telugu 20 Apr 2018, 10:04 am

వరసగా రెండు సినిమాలు డిజాస్టర్లే అయినా ఓవర్సీస్‌లో మహేశ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో మహేశ్ బాబుకు ఉన్న సత్తా ఏమిటో మరోసారి బయటపడింది. దాదాపు రెండు వేల స్క్రీన్లలో ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితం అయ్యింది. సినిమాపై ఉన్న హైప్‌ను క్రేజ్‌ను పరిపూర్ణంగా క్యాష్ చేసుకునేందుకు భారీ ఎత్తున్న ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయ్యాయి. ఈ ముందస్తు షోలతో మొత్తం దాదాపు 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకున్నారట డిస్ట్రిబ్యూటర్లు. ప్రీమియర్స్ పూర్తి అయిన నేపథ్యంలో, ఆ టార్గెట్ ను రీచ్ అయినట్టే అనే తెలుస్తోంది.
Samayam Telugu ban


ఇంత వరకూ ఓవర్సీస్ ప్రీమియర్లలో ఒకటిన్నర మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిన సినిమాలు తక్కువగానే ఉన్నాయి. బాహుబలి 2, కబాలి, అజ్ఒాతవాసి సినిమాలు ఓవర్సీస్ ప్రీమియర్స్ లో ఒకటిన్నర మిలియన్ డాలర్ల పై స్థాయి వసూళ్లను సాధించాయి. భరత్ కూడా వాటికి ధీటుగా వసూళ్లను సాధించినట్టే అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ముందస్తు బుకింగ్స్ నేపథ్యంలో ప్రీమియర్ షోల వసూళ్లపై త్వరగా క్లారిటీ వచ్చిందని వారు చెబుతున్నారు.

చదవండి: ‘భరత్ అనే నేను’: ధీమాగా వెళ్లొచ్చు ఎందుకంటే!

ఇటీవలే రామ్ చరణ్ తేజ సినిమా ‘రంగస్థలం’ ఓవర్సీస్ వసూళ్లలో తెలుగు సినిమా స్టామినాను నిరూపించింది. అందుకు ధీటుగా భరత్ కూడా సత్తా చూపించాడు. ప్రీమియర్స్, ఓపెనింగ్స్ ఓకే.. ఇక మౌత్ టాక్ ను బట్టి మిగతా కథ నడుస్తుంది!

Read Also: భరత్ అనే నేను ట్విట్టర్ రివ్యూ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.