యాప్నగరం

​డీజే.. ‘కమ్మవారు...’ డైలాగ్, కొత్త వివాదం!

విడుదలకు ముందు నుంచే బ్రహ్మణ సంఘాల నిరసనను ఎదుర్కొంది ‘డీజే’

TNN 24 Jun 2017, 12:04 pm
విడుదలకు ముందు నుంచే బ్రహ్మణ సంఘాల నిరసనను ఎదుర్కొంది ‘డీజే’ సినిమా. సినిమాలోని ఒక డ్యూయెట్ లో ఉపయోగించి పదజాలం పట్ల బ్రహ్మణ సంఘాలు అభ్యంతరాలు చెప్పాయి. నిరసన తీవ్ర స్థాయికి వెళ్లే సరికి డీజే యూనిట్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేసింది. చివరకు అభ్యంతరకర పదాలను తొలగించి వేరే పదాలతో ఆ పాటను పూర్తి చేసుకున్నారు.
Samayam Telugu cast disputes against dj movie
​డీజే.. ‘కమ్మవారు...’ డైలాగ్, కొత్త వివాదం!


మరి విడుదలకు ముందే అంత వివాదం రేపిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా కుల సంఘాల నుంచినే నిరసనను ఎదుర్కొంటోంది. బ్రహ్మణ సంఘాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ గాయత్రి మంత్రం చదవుతూ ఫైట్ చేసే సీన్ లో చెప్పులు ధరించి ఉంటాడని, చెప్పులు ధరించి గాయత్రి మంత్రాన్ని చదవడం అభ్యంతకరం అని బ్రహ్మణ సంఘాలు అంటున్నాయి. ఆ సీన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇక విజయవాడ మీద డైలాగ్ విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ‘విజయవాడలో పైన అమ్మవారు, కింద కమ్మవారు..’ అనే డైలాగ్ పట్ల కొన్ని కుల సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇంతకీ ఈ డైలాగ్ ను ఏ ఉద్దేశంతో పెట్టారు? అని వారు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో కమ్మ వారి ఆధిపత్య ఉంటుందని చెప్పదలిచారా? అని వారు అడుగుతున్నారు.

మొత్తానికి దువ్వాడ జగన్నాథాన్ని కుల వివాదాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు. కానీ.. ఇలాంటి వివాదాలు సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయనేది మాత్రం నిజం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.