యాప్నగరం

ఎమ్మెల్యే కొత్త లుక్‌లో కుమ్మేసిందిగా..

మాస్ హీరో గోపీచంద్ హీరోగా.. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘గౌతమ్ నంద’.

TNN 2 Jun 2017, 8:39 pm
మాస్ హీరో గోపీచంద్ హీరోగా.. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘గౌతమ్ నంద’. గోపీచంద్ గత చిత్రాలకు భిన్నంగా స్టైలిష్ లుక్‌లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. ఇటీవల విడుదలైన గోపీచంద్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా ఈమూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న కేథరిన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
Samayam Telugu catherine tresa first look from gopichands gautam nanda
ఎమ్మెల్యే కొత్త లుక్‌లో కుమ్మేసిందిగా..


సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యేగా అదిరే ఫర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ ఈ భామకు అవకాశాలు తలుపుతట్టలేదు. మధ్యలో రెండు మూడు సినిమాల్లో ఆఫర్స్ వచ్చినట్టే వచ్చి జారుకున్నాయి. అయితే గోపీచంద్ ‘గౌతమ్ నంద’ మూవీలో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈ లవ్ లీ ఏంజెల్. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో స్టైలిష్‌ అండ్ క్లాస్ లుక్‌తో అదరగొట్టేసింది ఈ బ్యూటీ.

శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈమూవీకి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.