యాప్నగరం

‘నిన్నుకోరి’: ఇంటికెళ్లినా ఆ జ్ఞాపకాలే

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని.. ‘నిన్నుకోరి’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

TNN 7 Jul 2017, 10:32 am
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని.. ‘నిన్నుకోరి’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఆది పినిశెట్టి, నివేతా థామస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. చిత్ర యూనిట్ కూడా బాగానే ప్రమోట్ చేసింది. ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ‘నిన్నుకోరి’ సూపర్ అంటూ మోసేస్తున్నారు.
Samayam Telugu celebrities talk on ninnu kori movie
‘నిన్నుకోరి’: ఇంటికెళ్లినా ఆ జ్ఞాపకాలే


చదవండి: ‘నిన్నుకోరి’ రివ్యూ: ఆహా.. ఓహో అంటున్నారే!

‘నిన్నుకోరి’ సినిమాపై హీరోయిన్ నిక్కీ గల్రానీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా వారితోపాటు ఇంటికి తీసుకెళ్తారు. హృదయాన్ని హత్తుకునే చిత్రం’ అని ట్వీట్‌లో పేర్కొంది.
A movie everyone will take home with them😊#NinnuKori ❤such a heart warming film👐 @AadhiOfficial @NameisNani @konavenkat99 @i_nivethathomas — Nikki Galrani (@nikkigalrani) July 5, 2017
మరోవైపు మంచువారి చిన్నబ్బాయి మనోజ్ కూడా నానికి అభినందనలు తెలిపాడు. ‘నిన్నుకోరి అద్భుతమైన సినిమా. చాలా బాగా నటించారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా’ అంటూ ట్వీట్ చేశాడు.
#NinnuKori is an awesome film with Great Performances ❤which makes it a must watch!Congrats @NameisNani @AadhiOfficial #NivethiThomas & team pic.twitter.com/tG7KB1fbJD — Manoj Manchu ❤️🙏 (@HeroManoj1) July 6, 2017
లక్ష్మీ మంచు కూడా సినిమా అద్భుతమంటూ పొగిడింది. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సన్నితమైన ప్రేమకథా చిత్రాల్లో ‘నిన్నుకోరి’ ఒకటి. నాని, ఆది, నివేతా థామస్ చాలా బాగా చేశారు’ అని లక్ష్మీ ట్వీట్ చేసింది.
#NinnuKori one of the most sensible loving movies I've seen in the recent times.@NameisNani, @AadhiOfficial #NivedaThomas BRILLIANT. — Lakshmi Manchu (@LakshmiManchu) July 5, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.