యాప్నగరం

ఒకరోజంతా సమంతతో... చైతూ మదర్

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే... అది సమంత - చైతూల ప్రేమ వ్యవహారమే.

TNN 17 Jun 2016, 9:52 am
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే... అది సమంత - చైతూల ప్రేమ వ్యవహారమే. సమంత తాను ప్రేమించిన హీరోనే కచ్చితంగా పెళ్లాడి తీరతానంటూ మీడియా ముందు చెబుతుంటే... నాగార్జున చైతూ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదంటూ ఫిల్మ్ నగర్లో టాక్. కాగా చైతూ తన తల్లి లక్ష్మి మద్దతు ఈ విషయంలో తీసుకుంటున్నట్టు సమాచారం. తల్లిని ఒక రోజంతా చెన్నైలో సమంతతో పాటూ ఉండమని చెప్పాడట. తల్లి కొడుకు చెప్పినట్టే సమంతో ఒకరోజంతా ఉందట. ఆమెకు సామ్ నచ్చేసిందని, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని అంటున్నారు. అలాగే చైతూ కూడా తన ప్రేమ విసయంపై తండ్రితో సీరియస్ గా చర్చించి నిర్ణయాన్ని తీసుకోదలచుకున్నాడని తెలుస్తోంది. నాగార్జున కూడా ఒప్పుకుంటే... త్వరలో పెళ్లి బాజా మోగచ్చు.
Samayam Telugu chaitu samanta love matter
ఒకరోజంతా సమంతతో... చైతూ మదర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.