యాప్నగరం

Actor Prabhu: ఆస్పత్రిలో చంద్రముఖి నటుడు ప్రభు.. అస్వస్థకు గురవడంతో తరలింపు.. అభిమానుల్లో టెన్షన్

ప్రముఖ తమిళ నటుడు, పలు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుండగా.. ఆరోగ్య పరిస్థితి పట్లు అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Authored bySanthosh Damera | Samayam Telugu 22 Feb 2023, 8:40 am

ప్రధానాంశాలు:

  • అస్వస్థకు గురైన తమిళ నటుడు ప్రభు
  • చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
  • లేజర్ సర్జరీతో కిడ్నీలో రాళ్లు తొలగింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Actor Prabhu
Actor Prabhu: ప్రభు
కోలీవుడ వెటరన్ యాక్టర్ శివాజీ గణేషన్ (Sivaji Ganesan) కుమారుడు, ప్రముఖ నటుడు ప్రభు (Prabhu) అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రభు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా.. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన ప్రభు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఆయన చివరగా దళపతి విజయ్ ‘వారిసు’ (Varisu) చిత్రంలో కనిపించారు.
నటుడు ప్రభు సినీ కెరీర్ విషయానికొస్తే.. 1982లో ‘సంగిలి’ చిత్రం ద్వారా తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. చాలా సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. మణిరత్నం ‘అంజలి’ (Anjali) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ప్రభు ఇప్పటికే 200కు పైగా చిత్రాల్లో నటించారు.

తెలుగులో రజినీకాంత్ ‘చంద్రముఖి’ (Chandramukhi) సినిమాతో పాటు ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ ( Darling) చిత్రంలో ఆయనకు మంచి పేరొచ్చింది. అలాగే రామ్ పోతినేని ‘ఒంగోలు గిత్త’ మూవీలోనూ నటించారు.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.