యాప్నగరం

సిట్ విచారణ పూర్తి: నవ్వులు చిందిస్తున్న చార్మి

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ ఇన్విస్టిగేషన్‌కు హాజరైన చార్మి విచారణ ముగిసింది.

TNN 26 Jul 2017, 5:33 pm
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ ఇన్విస్టిగేషన్‌కు హాజరైన చార్మి విచారణ ముగిసింది. ఆరున్నర గంటలపాటు జరిగిన ఈ విచారణలో పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన చార్మి విచారణ సాయంత్రం 4:45 వరకూ సాగింది. ఇక చార్మి విచారణలో ఏవిధంగా జరిగింది? ఎలాంటి ప్రశ్నలు సంధించారు అనే విషయానికి వస్తే.. చార్మి అభ్యర్థన మేరకు కోర్టు ఆదేశాలతో నలుగుగు మహిళా అధికారుల నేతృత్వంలో ఉదయం 10 గంటల నుండి ఈ విచారణ జరిగింది. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ అనిత, సీఐ విజయలక్ష్మి, రేణుక, శ్రీలత, బృందం సిట్‌ నేతృత్వంలో సుమారు 40 ప్రశ్నలను ఈ విచారణ కోసం తయారుచేసినట్లు తెలుస్తోంది. అయితే విచారణ అనంతరం బయటకు వచ్చిన చార్మి చాలా రిలాక్స్‌గా కనిపించింది. చాలా కూల్‌గా మీడియాకు అభివాదం చేస్తూ చిరునవ్వులు చిందించడం గమనార్హం. అయితే ఈ కేసు విషయంలో చార్మిని మరోమారు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Samayam Telugu charmi sit investigation over
సిట్ విచారణ పూర్తి: నవ్వులు చిందిస్తున్న చార్మి



చార్మి విచారణలో సిట్ అధికారుల ప్రశ్నల్లో కొన్నింటిని చూద్దాం..
1. మీరు ఎప్పుడైనా డ్రగ్స్ సేవించారా?
2. డ్రగ్స్ కేసులో పూరీ చాలా కీలకంగా ఉన్నారు. అతనికి మీకు ఉన్న రిలేషన్ ఏంటి?
3. పూరీ ఇంటికి మీరు వెళ్లే వారా?
4. పూరీతో మీరు పార్టీలకు హాజరయ్యేవారా?
5.కెల్విన్‌తో మీకు పరిచయం ఉందా?
6.కెల్విన్ కాల్ లిస్ట్ మీ ఫోన్ నంబర్ ఎందుకు ఉంది?
7.అతనితో తరచుగా వాట్సాప్ చాట్ చేసేవారా?
8.మీరు హాజరైన పార్టీల్లో మత్తు పదార్థాలు ఉండేవా?
9. మీరు తరచుగా బ్యాంకాక్ ఎందుకు వెళతారు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.