యాప్నగరం

దక్షిణాది హీరోయిన్లను వణికిస్తున్న ఒవియా!

ఒవియా.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ఆ పేరు వింటే ఇప్పుడు దక్షిణాది హీరోయిన్లకు చెమటలు పడుతున్నాయి.

TNN 18 Feb 2018, 9:51 pm
టీవల విడుదలైన తరుణ్ సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’ గుర్తుందా? అందులో తరుణ్‌ సరసన నటించిన హీరోయిన్ ఒవియాకు తమిళనాడులో మాంచి ఫాలోయింగ్ ఉంది. దురదృష్టవశాత్తు తొలి తెలుగు చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’ హిట్ కాకపోవడంతో ఆమె మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అయితే, దక్షిణాదిలో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతోంది. దక్షిణాదిలోని అగ్ర హీరోయిన్లకు సైతం చెమటలు పట్టిస్తోంది.
Samayam Telugu chennai times most desirable woman of 2017 is oviya
దక్షిణాది హీరోయిన్లను వణికిస్తున్న ఒవియా!


చెన్నై టైమ్స్ నిర్వహించిన ‘మోస్ట్ డిజరిబుల్ హీరోయిన్ 2017’ పోల్‌లో ఒవియా అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె క్రేజ్ ముందు.. ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే నయనతార రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. చిత్రం ఏమిటంటే ఒవియా ఇప్పటివరకు చేసిన సినిమాలు పాతిక మించవు. వాటిలో హిట్లు కూడా తక్కువే. అయితే, తమిళనాడులో మాత్రం ఆమెకు భలే క్రేజ్ ఉంది.

కేరళాకు చెందిన ఒవియా ‘కలవాణి’ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయమైంది. కొన్నాళ్లు ఆమెకు అక్కడ మంచి క్రేజ్ లభించినా.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. తట్ట బుట్ట సద్దుకుంటున్న సమయంలో ‘ఇది నా ప్రేమ కథ’లో అవకాశం వచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే, ఆ సినిమా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తుండటంతో ఒవియా.. ఆశలు వదిలేసుకుంది. ఆ సమయంలోనే తమిళ ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.

దీంతో ఒక్కసారిగా ఒవియాకు క్రేజ్ పెరిగిపోయింది. పలు వివాదాలు, లవ్‌స్టోరీలతో ఆమె ‘బిగ్‌బాస్’ను రక్తికట్టించింది. ఆ క్రేజే ఇప్పుడు ఆమెను దక్షిణాది టాప్ హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిపింది. నయన్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ 3, శ్రద్ధా 4, కాజల్ అగర్వాల్ 5వ స్థానంలో ఉన్నారు. గతేడాది 13, 16 స్థానాల్లో ఉన్న అమలాపాల్, హన్సికలు 28, 30 స్థానలకు పడిపోయారు. ఈ క్రేజ్ మళ్లీ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

2016తో పోల్చితే అనుష్క శెట్టి, తమన్నా, సమంత, త్రిషా వంటి అగ్ర నాయికల ర్యాంకింగ్ కిందకి పడిపోవడం గమనార్హం. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో కింది జాబితాలో చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.