యాప్నగరం

Meher Ramesh: మెహర్ రమేష్‌తో మెగాస్టార్ మూవీ.. బెంబేలెందుకు బాస్?

మెహర్ రమేష్.. ఈ దర్శకుడి పేరు వింటే నిర్మాతలకు వణుకు మొదలౌతోంది. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి రెండక్షరాల సినిమాలు నాలుగు చేసినప్పటికీ ఖర్చు మాత్రం కోట్లలోనే. వాటిలో హిట్ దగ్గకపోయినప్పటికీ స్టైలిష్ దర్శకుడు అనిపించుకున్నారు.

Samayam Telugu 20 Apr 2020, 8:03 pm
మెగాస్టార్ చిరంజీవి ట్రెండ్‌ని సెట్ చేయడమే కాదు.. ట్రెండ్‌కి తగ్గట్టుగానే సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ‘ఖైదీ నెం 150’తో సేఫ్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. సైరాతో ప్రయోగం చేశారు. ఈ సినిమాతో యువ దర్శకుడు సురేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అనుకున్నంత రేంజ్‌లో హిట్ కాలేకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని నిరాశపరచలేదు. ఇక ప్రస్తుతం ఓటమి ఎరుగని స్టార్ దర్శకుడు కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి లాక్ డౌన్‌తో పెద్ద బ్రేక్ పడింది.
Samayam Telugu Chiranjeevi Meher Ramesh Movie
చిరంజీవి మెహర్ రమేష్


అయితే ఈ ఖాళీ సమయాన్ని చిరంజీవి వృధా చేయకుండా కథల ఎంపికకు కేటాయిస్తున్నారట. ఆచార్య సినిమా తరువాత యువ దర్శకులతో సినిమా చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు చిరంజీవి. ఈ లిస్ట్‌లో డిజాస్టర్ దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉండటం మెగా అభిమానుల్ని కలవరపెడుతోంది. ఓ ప్రముఖ ఛానల్‌తో మాట్లాడుతూ.. తన ఫ్యూచర్ ఫిల్మ్స్‌పై క్లారిటీ ఇచ్చారు చిరు.

ఈతరం దర్శకులు కొత్త ఆలోచనలతో వస్తున్నారని.. ఈ జనరేషన్‌కి ఏం నచ్చుతుందో వాళ్లకు బాగా తెలుసుని.. తనకు సూటయ్యే కథలతో యువ దర్శకులు వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ‘లూసిఫర్’ చిత్రానికి గానూ సుజీత్‌తో చర్చలు జరుగుతున్నాయన్నారు. అలాగే దర్శకుడు బాబీ కథను చెప్పారని.. మెహర్ రమేష్‌ కూడా కథ వినిపించారని చెప్పారు.

స్టైలిష్ అండ్ కాస్ట్లీ డైరెక్టర్‌గా పేరొందిన మెహర్ రమేష్.. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించి పేరైతే సంపాదించారు కాని హిట్ అందుకోలేకపోయారు. పైగా ఆయన డైరెక్ట్ చేసిన అన్ని చిత్రాలు భారీ బడ్జెట్‌లే కావడంతో ఈయనతో సినిమా అంటే నిర్మాతలకు వణుకుగా ఉంటుంది. షాడో సినిమా తరువాత ఈ దర్శకుడు సినిమాలకు దూరంగానే ఉంటూ.. మహేష్ బాబు సినిమా కథల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్ లిస్ట్‌లో మెహర్ రమేష్ ఉండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.