యాప్నగరం

ప్రభుత్వానికి బండ్ల గణేష్ సూచన.. చిరంజీవిని ఉద్దేశిస్తూ పవన్ భక్తుడి కామెంట్స్! అలా చేస్తే..

పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్న బండ్ల గణేష్.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 23 Aug 2021, 3:55 pm
మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టపడే, పవన్ కళ్యాణ్ భక్తుడినని ఓపెన్‌గా చెప్పుకునే బండ్ల గణేష్.. ఈ మధ్యకాలంలో తరచుగా ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్నారు. పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్న ఆయన, తాజాగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన గురించి తన మనసులో ఉన్న ప్రత్యేకమైన కోరికను బయటపెడుతూ ప్రభుత్వానికి ఆసక్తికర ప్రతిపాదన చేయడం హాట్ టాపిక్ అయింది.
Samayam Telugu ప్రభుత్వానికి బండ్ల గణేష్ సూచన.. చిరంజీవిని ఉద్దేశిస్తూ!
Bandla Ganesh Chiranjeevi


చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రముఖ దర్శకులు, నిర్మాతలతో ట్విట్టర్‌లో స్పేస్ నిర్వహించడం జరిగింది. ఈ సెషన్‌లో పాల్గొన్న బండ్ల గణేష్.. తనదైన శైలిలో మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగువారికి ఒక పండుగ రోజు అంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తూ మెగా అభిమానులను ఫిదా చేశారు. సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదని బండ్ల గణేష్ అన్నారు.

చిరంజీవి జీవిత కథను పాఠశాల పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో చేర్చి పాఠంగా నేర్పిస్తే భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, అలా చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానంటూ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు బండ్ల గణేష్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా అభిమాన లోకం పాజిటివ్‌గా స్పందిస్తోంది.
Chiranjeevi : Pawan Kalyanను కొట్టిన సురేఖా.. చిరంజీవి ముందే అలా.. వీడియో వైరల్
ఇకపోతే తొలుత కమెడియన్‌గా రాణించి ఆ తర్వాత నిర్మాతగా తన మార్క్ చూపించిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరో అవతారం ఎత్తబోతున్నారు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.