యాప్నగరం

జగన్‌ను ఆకాశానికి ఎత్తేసిన చిరంజీవి.. బర్త్ డే రోజు స్పెషల్ ట్వీట్

బర్త్ డే రోజు సినీ ప్రముఖులంతా ప్రత్యేకంగా జగన్‌కు ట్వీట్ చేస్తూ విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు చిరు కూడా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 21 Dec 2020, 1:12 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ సెలబ్రిటీలంతా సీఎంకు విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి... జగన్‌కు బర్త్ డే విషెస తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌పై చిరు ప్రశంసలు కురిపించారు. ‘ డైనమిక్ యువ నాయకుడు @ వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంకల్పాన్ని, లక్ష్యాలను గ్రహించడంలో మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. మీకు మరింత అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మీరు మరిన్ని రోజులు ప్రజలకు ఈ విధంగా సేవా చేయాలని కోరుకుంటున్నా’ అంటూ చిరు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu జగన్‌కు చిరు విషెస్
chiranjeevi on cm jagan


Read More: సీఎం జగన్ బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

సీఎం జగన్ అయ్యాక సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి చిరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పట్లో చిరు నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా చూడాలని జగన్‌ను కోరారు చిరు. ఏదీ ఏమైనా మెగాస్టార్ విషెస్‌తో వైసీపీ శ్రేణులు పుల్ జోష్‌లో ఉన్నారు. చిరంజీకి ధన్యవాదాలు తెలిపారు. చిరుతో పాటు.. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకంక్షలు తెలిపారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మంచు విష్ణు, నిర్మాత బండ్ల గణేష్ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. అటు ఏపీలో కూడా వైసీపీ శ్రేణులు జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.