యాప్నగరం

Chiranjeevi: అదరగొట్టావ్ అల్లుడు.. కమ్‌బ్యాక్ దద్దరిల్లింది.. సాయిధరమ్‌పై మెగాస్టార్ కామెంట్స్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ ఈ రోజే (ఏప్రిల్ 21న) విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వినిపిస్తుండటంతో ట్విట్టర్ వేదికగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆనందం వ్యక్తంచేస్తూ అల్లుడికి కంగ్రాట్స్ తెలిపారు.

Authored bySanthosh Damera | Samayam Telugu 21 Apr 2023, 6:38 pm

ప్రధానాంశాలు:

  • ‘విరూపాక్ష’ హిట్‌పై స్పందించిన మెగాస్టార్
  • మేనల్లుడికి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్
  • టీమ్ మొత్తాన్ని అభినందించిన చిరు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sai Dharam Tej
Chiranjeevi: సురేఖ, సాయిధరమ్ తేజ్
గతేడాది యాక్సిడెంట్‌కు గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కొన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ‘విరూపాక్ష’ (Virupaksha) మూవీతో నేడు (ఏప్రిల్ 21) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కార్తీక్ వర్మ దండు (Karthik Varma) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ (Samyuktha Menon), సోనియా సింగ్ ఫిమేల్ లీడ్స్‌గా నటించారు. తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar) స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద ‘విరూపాక్ష’ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సాయిధరమ్‌కు ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ఆయన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన వైఫ్ సురేఖ.. సాయిధరమ్‌ తేజ్‌కు కేక్ తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ స్పెషల్ నోట్ యాడ్ చేశారు. ‘విరూపాక్ష గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వినబడుతున్నాయి! ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను డియర్ తేజు. నీ కమ్‌బ్యాక్ దద్దరిల్లింది. ఈ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు చిరు. ఈ మేరకు హీరోయిన్ సంయుక్త, డైరెక్టర్ కార్తిక్ వర్మ, మ్యూజిక్ డైరెక్టర్ అజనీస్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ఎడిటర్ నవీన్ నూలిని ట్యాగ్ చేశారు.

‘విరూపాక్ష’ సినిమా విషయానికొస్తే.. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా.. శ్యామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. వీళ్లిద్దరి వర్క్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. మొత్తానికి సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీతో తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నాడు.
ఇక యాక్సిడెంట్ తర్వాత మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనకు ఎంత సపోర్ట్‌గా నిలిచారో సాయిధరమ్ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించడం తెలిసిందే. కోలుకున్న తర్వాత షూటింగ్‌కు వచ్చినపుడు మాట్లాడేందుకు కష్టపడ్డానని, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి గాడిలో పడ్డానని చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కోసం సాయిధరమ్ పడ్డ కష్టం కోసమైనా సినిమా హిట్ కావాలని అభిమానులందరూ కోరుకున్నారు. అనుకున్నట్లుగానే ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.