యాప్నగరం

తమిళనాడుకి పయనమవుతున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి‌కి పాలిటిక్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టి ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

TNN 5 Jan 2018, 12:44 pm
మెగాస్టార్ చిరంజీవి‌కి పాలిటిక్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టి ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ అనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్ నిర్మాతగా డీల్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తికాగా సెకండ్ షెడ్యూల్‌ కోసం తమిళనాడుకు పయనమవుతున్నారు మెగాస్టార్.
Samayam Telugu chiranjeevi sye raa narasimha reddy shooting updates
తమిళనాడుకి పయనమవుతున్న మెగాస్టార్


డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మూవీ తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తికాగా షూటింగ్‌కి స్మాల్ గ్యాప్ ఇచ్చింది చిత్ర యూనిట్. కాగా ఫిబ్రవరి తొలివారం నుండి తమిళనాడులోని పొల్లాచ్చిలో సెకండ్ షెడ్యూల్ జరపనున్నారు. సుమారు 20 రోజుల పాటు ఇక్కడే ‘సైరా’ షూటింగ్ జరగనుంది. సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం విశేషం. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నాజర్, ముకేశ్ రుషి, రఘుబాబు, సుబ్బరాజు ఇతర ప్రధాన తారాగణం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.