యాప్నగరం

ఉక్రెయిన్‌కు వెళ్తున్న చిరంజీవి !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150'వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు...

Samayam Telugu 18 Oct 2016, 5:26 pm
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అలానే చిరు, లక్ష్మీ రాయ్‌ల స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో చరణ్ కూడా కనిపించనున్నాడని టాక్. లారెన్స్ కంపోజిషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాట సినిమాకు ఓ హైలైట్ అంశంగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
Samayam Telugu chiranjeevi to go ukrain with kajal for khaidi no 150 songs shooting
ఉక్రెయిన్‌కు వెళ్తున్న చిరంజీవి !


చాలా కాలం తరువాత చిరంజీవి వెండితెరపై స్టెప్స్ వేస్తుండడంతో ఈ సినిమా పాటలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకి తగినట్టుగానే పాటలన్నీ విజువల్ ఫీస్ట్‌గా వుండేందుకుగాను త్వరలోనే మెగాస్టార్ తన డ్యూయెట్స్ కోసం ఉక్రెయిన్ వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోనే చిరు, కాజల్‌ల మధ్య పాటలను చిత్రీకరించి త్వరలోనే క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరపడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం క్లైమాక్స్ సన్నివేశాల్లో శ్రియ కనిపించనుందనే మాటలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.