యాప్నగరం

డీఎస్పీకి కొత్త అర్థం చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ పేరుకి కొత్త నిర్వచనం చెప్పారు.

Samayam Telugu 23 Apr 2017, 8:45 pm
సినిమా వార్తల గురించి చర్చించుకున్నప్పుడు డీఎస్పీ అంటే దేవీశ్రీ ప్రసాద్ అని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో ఈ ఫేమస్ మ్యూజిక్ కంపోజర్‌ని ముద్దుగా డీఎస్పీ అని పిలుచుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ డీఎస్పీకి మెగాస్టార్ చిరంజీవి మాత్రం మరో కొత్త నిర్వచనం చెప్పారు. డీ అంటే డెడికేషన్, ఎస్ అంటే స్ట్రాటెజీ, పీ అంటే పాపులారిటీ అని డీఎస్పీకి కొత్త అర్థం చెప్పారు చిరు. మే 27వ తేదీన సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న డీఎస్పీ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ టూర్‌కి సంబంధించిన ప్రోమోని ఆదివారం ఉదయం చిరు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ టాలెంట్‌ని అభినందిస్తూ చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu chiranjeevis definition about dsp
డీఎస్పీకి కొత్త అర్థం చెప్పిన చిరు


ఇదే వేదికపై డీఎస్పీకి వున్న ప్రతిభ గురించి ప్రశంసలు గుప్పించిన చిరంజీవి.. సామాజిక సేవలోనూ డీఎస్పీ ముందున్నాడని అన్నారు. డీఎస్పీ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి మరణానంతరం సత్యమూర్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నందుకు డీఎస్పీని అభినందించారు చిరంజీవి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.