యాప్నగరం

చిరు అల్లుడు హీరోగా.. ఆ బ్యానర్‌లో సినిమా షురూ!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ మూవీ వారాహి బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 12కు క్లాప్ కొట్టారు.

TNN 31 Jan 2018, 11:42 am
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ మూవీ వారాహి బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 12కు క్లాప్ కొట్టారు. వారాహి ఆఫీస్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటూ పలువురు ఇండస్ట్రీ పెద్దలు సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ క్లాప్ కొడితే... రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.
Samayam Telugu chiranjeevis son in law kalyan dhev debut movie launched
చిరు అల్లుడు హీరోగా.. ఆ బ్యానర్‌లో సినిమా షురూ!


కళ్యాణ్‌కు మెగాస్టార్, డైరెక్టర్ రాజమౌళిలు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మూవీ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను వారాహి బ్యానర్‌లో ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత సాయి కొర్రపాటి. మంచి స్టోరీ లైన్ దొరికిందని... కాన్సెప్ట్‌కు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నామన్నారు. ఈ మూవీకి జత కలిసే మూవీ డైరెక్టర్ రాకేష్ డైరెక్ట్ చేస్తుండగా... దేవ్‌కు జోడీగా ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. కెమెరా వర్క్ బాధ్యత సెంథిల్‌ కుమార్‌కు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.