యాప్నగరం

రోజాను పిలిపించి చెప్పుతో కొట్టిస్తా: డైరెక్టర్‌కి రాకేష్ మాస్టర్ వార్నింగ్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్.. దర్శకుడు అజయ్ కౌండిన్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ కౌండిన్య ఇంటర్వ్యూల్లో నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన రోత, రొచ్చు పనులు చేయడం మానుకోవాలి. ఆయనకునేను ఇచ్చే సలహా ఇదే’ అన్నారు. దాంతో రాకేష్ మాస్టర్‌కు ఈ విషయం తెలిసి అజయ్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అజయ్ తనపై చేసినా కామెంట్స్‌కు మూతి పగిలేలా సమాధానం చెప్పారు.

Samayam Telugu 25 Dec 2019, 4:32 pm

Samayam Telugu choreographer rakesh master fires on director ajay koundinya for his nasty comments
రోజాను పిలిపించి చెప్పుతో కొట్టిస్తా: డైరెక్టర్‌కి రాకేష్ మాస్టర్ వార్నింగ్

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు

‘‘నిన్ను ఇంటర్వ్యూకి పిలిచి నా గురించి అడిగినప్పుడు నేనేదో తప్పు పనులు చేసినట్లు మాట్లాడావు. అసలు నేనేం చేశానో ఇప్పుడు చెప్పు. నేను చేసిన రోత పనులు ఏంటి? నీకు నా గురించి ఏమీ తెలీనప్పుడు తెలీదనే చెప్పు. అంతేకానీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తావా? నా గురించనే కాదు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు ఎవరైనా సరే మరో సెలబ్రిటీ గురించి అడిగినప్పుడు నిజాలు మాత్రమే మాట్లాడండి. అంతేకానీ తెలీకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’’

రోజాను పిలిపించి చెప్పుతో కొట్టిస్తా

‘‘ఇంతకుముందు నువ్వు ఇదే ఇంటర్వ్యూలో రోజాతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా తీయాలి అన్నావ్. అది ఎంత పెద్ద తప్పో తెలుసా. ఇప్పటికిప్పుడు నేను రోజాను పిలిపించి నిన్ను చెప్పుతో కొట్టించగలను. నోటిదూల తగ్గించుకోండి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడి సెలబ్రిటీని అయిపోయానంటే ఎవరూ ఒప్పుకోరు. నువ్వు నాకు సారీ చెప్తే అన్నీ సర్దుకుపోవు. ఓ అమ్మాయికి కడుపు చేసి సారీ చెప్పి వదిలేస్తే సరిపోతుందా’’

శ్రీరెడ్డిని కూడా వదలను

‘‘శ్రీరెడ్డిని కూడా నేను వదలను. ఇప్పటికీ ఆమెను నాతో ఫేస్ టు ఫేస్ చర్చకు రమ్మని చాలా సార్లు పిలిచాను. కానీ ఆమె భయపడి రావడంలేదు. శ్రీరెడ్డి వచ్చి మాస్టర్.. అంటూ బుజ్జగించి మాట్లాడినా నేను వదలను’’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.